Skip to main content

నేటి మోటివేషన్... నీ విలువ ఎప్పుడూ తగ్గదు...



ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్నగదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు.
⏩తన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు.
ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు.
⏩సరే ఈ వెయ్యి రూపాయలని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ వెయ్యి
రూపాయలని బాగా మడతలు పడేలా నలిపేసాడు.
⏩మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు చేతుల్ని లేపారు.
⏩తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ వెయ్యి రూపాయలని కింద
పడేసి తన కాళ్ళతో తోక్కేసాడు. అప్పుడు ఆ వెయ్యి రూపాయలు నోటు బాగా మడతలు పడి,
మట్టి కొట్టుకుపోయింది. 
⏩మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు.
⏩అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు...
నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు.
⏩ఇప్పటి వరకు ఈ వెయ్యి రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు.
⏩ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ వెయ్యి
రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి వెయ్యి రూపాయలు.
🔄అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి
ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.. కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని
సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం. జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది.. ఒకవేళ
మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు..
✅జీవితం ప్రతి సారి మనకు ఒక క్రొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది... జారవిడచిన
అవకాశాల కోసం చింతించక క్రొత్త ఆశలతో సరికొత్త ఊహలతో ముందడుగు వేయి...
రూపాయి నోటు ఎంత చిరిగినా దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో.. మన విలువ కూడా ఎప్పటికీ
తరగదు..
"నువ్వు ఎప్పడు నీ విలువను
పోగొట్టుకోలేవు".
"నువ్వు ఒక గొప్ప వ్యక్తివి" ...
ఈ విషయం ఎప్పటికి మరవొద్దు....

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺