Skip to main content

Posts

Showing posts from December, 2020

నేటి మోటివేషన్... నీ జీవితం మీద నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి...

మనం జీవితంలో పైకెదగాలి అంటే.. ముందు మనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలి.. మనం అంటే ఏంటో మన చుట్టుపక్కల వాళ్లకు ఓ అవగాహన వచ్చేలా మన ప్రవర్తన ఉండాలి. అబ్బో వాడు చాలా ఖతర్‌నాక్ గురూ..  వాడి దగ్గర మన ఆటలు సాగవు.. అని వాళ్లు అనుకునేలా మన బిహేవియర్ ఉండాలి.🌲😍 అంతే కానీ.. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసేలా ఉండకూడదు. ఎంతటి ఆప్తులైనా సరే.. వాళ్లు చెప్పేదాంట్లో వాస్తవం ఎంతవరకూ ఉందనే విషయంపై మనంకూట సొంత అంచనా ఉండాలి. లేకపోతే.. మనల్ని బురిడీ కొట్టించడానికి జనం రెడీగా ఉంటారు. మరో విషయం ఏంటంటే.. మనలో చాలా మంది ఒకరి గురించి మరొకరికి చెడుగా మాట్లాడుకుంటారు., ఇక ఇద్దరు ఒకచోట కలిస్తే.. మన ముందు లేని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు చాలా మంది. ఇలాంటి వాళ్లు మన మధ్య చాలా మందే ఉంటారు. ఒకరి గురించి నీకు ఒకడు చెబుతున్నాడు అంటే నీ గురించి మరొకరికి చెబుతాడు కదా.. ఈ లాజిక్ అస్సలు మిస్ కావద్దు. అందుకే జీవితంలో ఎప్పుడైనా మన సొంత అవగాహన మనకు ఉండాలి.,☘️ అందుకే ఎవరైనా ఏదైనా చెప్పినా.. దానిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. వాస్తవానికి.. చాలామంది తామేదో పెద్ద తోపులం అనుకుంటారు కానీ.. వాస్తవానికి వాళ్లు చాలా అమాయకుల...

నేటి మోటివేషన్... మనిషి విలువ నోరు చెబుతుంది "

చక్కనికథ  ఒకసారి  విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు.      వేటాడుతూ ...... వేటాడుతూ .......  అడవిలో ఒకరికొకరు దూరమైనారు.  ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా ........ అతన్ని చూసిన విక్రమాదిత్యుడు ......  " సాధు మహరాజ్........ ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా....... ? అని అడిగాడు. ఆ అంధ సాధువు ఇలా అన్నాడు:  " మహారాజా......! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి  కూడా ఇంతకుముందే వెళ్ళాడు " అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో ......   " మహాత్మా........ మీకు నేత్రాలు కనిపించవు కదా!  నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు....? " అని అడిగారు . అంధుడైన సాధువు ఇలా చెప్పాడు:  " మహారాజా....!  నేనా ముగ్గురినీ, మిమ్ములను  మీ మాటలు విని కనిపెట్టాను.  అందరి...

నేటి మోటివేషన్... మీ చిన్నప్పుడు చదవకపోతే... ఇప్పుడైనా చదవండి...

ఒక రోజు ఒక అడవిలో వేటకు బయలుద్యారిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తోంది. ఆ ఆవుని చూడగానే పులికి నోరూరుంది. ఈ రోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించు కుంది. ఆ ఆవు పైబడ డానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది. “ఆగండి పులిగారు, ఆగండి!” అని గట్టిగా కేక పెట్టింది. పులి నిర్ఘాంత పోయింది. ఇంత వరకు ఏ జంతువూ పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయ పడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం, పులికి తెలుసు. కాని ఇలా ఆగమనడం? ఇది కొత్త విషయం. సంగతేంటో తెలుసుకుందామని పులి ఆగింది. “అడగ గానే ఆగినందుకు థాంక్స్, మీకు అడ్డు పడినందుకు క్షమించండి.” అంది ఆవు. “విషయం ఏమిటో చెప్పు” అంది పులి. “నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలు ఇచ్చి, ఈ అడవిలోకి వచ్చి, రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళి వెళ్లి దూడకు పాలిస్తాను. రోజు లాగానే ఈ రోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళి వస్తానని, పాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్లక పొతే నా దూడకు పాలుండవు. జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ వుంటుంది నా బిడ్డ. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్లి దూడకి పాలిచ్చి, జరిగిందంతా చెప్పి, మళ్ళీ పొ...

నేటి మోటివేషన్... నాన్నలందరికి అంకితం

SALUTE TO ALL FATHERS  నాన్న_మనకోసం  ఏం_చేశాడో  ఏం_కోల్పోయాడో   మనకు_తెలియదు..! జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి.  తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు.  నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.  ఎందుకంటే.. నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు.  అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు.  నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు.  బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.  ‘ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం.  పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు.  నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు.  పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.  మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి.  చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్య...

మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి

శుభోదయం మిత్రులందరికీ .....!! మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారో ఆ లక్ష్యం మిమ్మల్ని పరీక్షిస్తుంది.మీరు నిజంగా ఎదైనా సాధించాలని అనుకుంటుంటే,మీరు చరిత్రను తిరగేసి చూడండి, సాధించిన వారు ఎవరు కూడా కేవలం ఇంట్రెస్ట్ వల్ల సాధించిన వాళ్ళు ఎవరు లేరు. నిబద్ధతో సాధించినవారే ఎక్కువ.నువ్వు ఎ లక్ష్యం కోసం ముందుకు వెళ్తున్నావో వెళ్ళే దారిలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి ,ఎన్నో ఆటంకాలు వస్తాయి,ఎన్నో సమస్యలు వస్తాయి.ఇవన్ని నీ లక్ష్యం నీకు పెడుతున్న పరిక్షలు .ఆ పరీక్షలో ఆగిపోతవా ,ఎదురుకుని ముందుకుపోతవా..! మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం వైపే మీ అడుగులు వేయండి .మీరు మీ జీవితంలో ఎన్ని పరిక్షలు ఎదురుకుంటే అంత మంచి భవిష్యతును పొందగలరని గుర్తుపెట్టుకోండి.ఒకసారి ఫెయిల్ అవ్వు తప్పు లేదు,మరలా ప్రయత్నం చేయి,మరలా ఫెయిల్ అయ్యావా అవ్వు నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి నీకు ఒక అనుభవం వస్తుంది. ఒక థామస్ అల్వ ఎడిసన్ ఒక బల్బును కనిపెట్టడానికి 1000 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు కానీ ఆయన పట్టుదలను వదులుకోలేదు .1001 సారి ప్రయత్నం చేసాడు సాధించాడు.అయ్యో నేను ఫెయిల్ అయ్యానే అని వదిలేసి ఉంటె మనం ఈ చీక...

నేటి మోటివేషన్... పాత కథే అయినా ధైర్యాన్నిచ్చే చక్కని కథ

ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది... ఆ పాము కోతిని కాటు వేయబోయింది... భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం.. కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది... మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే... మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి... తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది... అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.. ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది.. వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని... కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది... ఇందులోని నీతి ఏంటంటే... నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు... కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వె...

నేటి మోటివేషన్... మనిషిని అభిమానించండి, వస్తువులను కాదు.

ఒక సెలవురోజు భార్య భర్తతో  "మనం కాసేపు మాట్లాడుకోవాలి! మీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి!!" అంది   "ఫోన్ ఉంటే ఏమౌతుంది?" ఏమీ కాదు అందుకే మీరు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి.     "సరే చెప్పు !! "ఏం మాట్లాడాలి?" అన్నాడు. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ..    "మీరు మారిపోయారు!" "మన పెండ్లి నిశ్చితార్థం నుండి పెండ్లి వరకు ఎలా ఉన్నారు?"   "అప్పుడు గంట గంటకు మెసేజ్ లు లేదా ఫోన్లు!"  లేచిన తర్వాత మొదటిమాట నీతోనే..పడుకునే ముందు చివరిమాట నీతోనే... మొదటీ చివరీ మాటల మధ్య రోజంతా నీ ఆలోచనలతోనే అనేవారు.. అలాగే ఉండేవారు'. "పెండ్లైన సంవత్సరం వరకు ఎలా ఉన్నారు?" "మీ కళ్ళలో..ప్రవర్తనలో ఎంతప్రేమ కనిపించేది ఇష్టంగా చూస్తున్న మీ కళ్ళలోకి చూస్తేనే మైకం కమ్మేది నాకు ఇప్పుడు కూడా అప్పటి మీ చూపులు గుర్తొచ్చినపుడు మనసంతా తన్మయత్వంగా అనిపిస్తుంది "ఇప్పుడెలా వున్నారు?" "మీ ప్రేమంతా ఎటుపోయింది?ఆ ఇష్టంగా చూసే చూపులేవి? ఒక గోడనో.. వస్తువునో చూసినట్లుండే ఆ చూపులు నాకు నచ్చట్లేదు!!" "మీరెందుకు మారి పోయారు?నాకు కారణం తెలియాలి!!...

నేటి మోటివేషన్... ⭕️ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు?!!!⭕️

 అద్భుతంగానా, డిజప్పాయింటెడ్‌గానా, బోర్‌గానా, చిరాకుగానా…?!!!  ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది. బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే “నెగిటివ్ ప్రోగ్రామింగ్” చేయబడుతోంది బ్రెయిన్. బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు “ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది. మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్. మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. “బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది. దానికి మనం అప్పజ...

నేటి మోటివేషన్... త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది. . అవును ఇది ఒక చేదు నిజం । . ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.   వాళ్ళు..... .  రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు ! ఉదయం పెందరాళే లేచేవాళ్ళు ! నడక అలవాటు ఉన్నవాళ్ళు!  మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు ! . వాళ్ళు..... . .  ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు ! ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!  మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!  పూజకు పూలు కోసే వాళ్ళు ! . .వాళ్ళు.... . పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు ! మడిగా వంట వండేవాళ్ళు ! దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!  దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు ! దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!! మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!! . వాళ్ళు  .  అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు!  కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు ! తోచిన సాయం చేసేవాళ్ళు ! చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు ! . వాళ్ళు  . ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు ! ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు ! పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు!  ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసి...

నేటి మోటివేషన్... నీ విలువ ఎప్పుడూ తగ్గదు...

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్నగదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు. ⏩తన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు. ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు. ⏩సరే ఈ వెయ్యి రూపాయలని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ వెయ్యి రూపాయలని బాగా మడతలు పడేలా నలిపేసాడు. ⏩మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు చేతుల్ని లేపారు. ⏩తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ వెయ్యి రూపాయలని కింద పడేసి తన కాళ్ళతో తోక్కేసాడు. అప్పుడు ఆ వెయ్యి రూపాయలు నోటు బాగా మడతలు పడి, మట్టి కొట్టుకుపోయింది.  ⏩మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు. ⏩అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు... నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు. ⏩ఇప్పటి వరకు ఈ వెయ్యి రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు. ⏩ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ వెయ్యి రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి వెయ్యి రూపాయలు. 🔄అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి ఎన్నో ఎద...