మనం జీవితంలో పైకెదగాలి అంటే.. ముందు మనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలి.. మనం అంటే ఏంటో మన చుట్టుపక్కల వాళ్లకు ఓ అవగాహన వచ్చేలా మన ప్రవర్తన ఉండాలి. అబ్బో వాడు చాలా ఖతర్‌నాక్ గురూ.. వాడి దగ్గర మన ఆటలు సాగవు.. అని వాళ్లు అనుకునేలా మన బిహేవియర్ ఉండాలి.🌲😍 అంతే కానీ.. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసేలా ఉండకూడదు. ఎంతటి ఆప్తులైనా సరే.. వాళ్లు చెప్పేదాంట్లో వాస్తవం ఎంతవరకూ ఉందనే విషయంపై మనంకూట సొంత అంచనా ఉండాలి. లేకపోతే.. మనల్ని బురిడీ కొట్టించడానికి జనం రెడీగా ఉంటారు. మరో విషయం ఏంటంటే.. మనలో చాలా మంది ఒకరి గురించి మరొకరికి చెడుగా మాట్లాడుకుంటారు., ఇక ఇద్దరు ఒకచోట కలిస్తే.. మన ముందు లేని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు చాలా మంది. ఇలాంటి వాళ్లు మన మధ్య చాలా మందే ఉంటారు. ఒకరి గురించి నీకు ఒకడు చెబుతున్నాడు అంటే నీ గురించి మరొకరికి చెబుతాడు కదా.. ఈ లాజిక్ అస్సలు మిస్ కావద్దు. అందుకే జీవితంలో ఎప్పుడైనా మన సొంత అవగాహన మనకు ఉండాలి.,☘️ అందుకే ఎవరైనా ఏదైనా చెప్పినా.. దానిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. వాస్తవానికి.. చాలామంది తామేదో పెద్ద తోపులం అనుకుంటారు కానీ.. వాస్తవానికి వాళ్లు చాలా అమాయకుల...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...