ఆది మానవుడు గుహల్లో ఉండేటప్పుడు, అడవుల్లో వేటాడి బ్రతికేటప్పుడు మనిషి మెదడు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఏదైనా జంతువు దాడి చేస్తే దానిపై తిరగబడడం లేదా పారిపోవడం (ఫైట్ లేదా ప్లెట్) స్పందనని సృష్టించే బ్రెయిన్లోని ఎమోషనల్ సెంటర్ అయిన అమిగ్డాలా అప్పట్లో ప్రధాన పాత్ర పోషించేది. ఏళ్ల తరబడి మానవ పరిణామ క్రమంలో ఇది మరింత బలోపేతం అవుతూ వచ్చింది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు, సమాజాలు ఏర్పడడం, వంట చేసుకోవడం, భాషలు నేర్చుకోవడం వంటి కాగ్నిటివ్ స్కిల్స్ జీవనోపాధి కోసం అలవాటు చేసుకున్న కొద్దీ బ్రెయిన్ పరిమాణం పెరుగుతూ ప్రీ-ఫ్రాంటల్ కార్టక్స్ అనే బ్రెయిన్లోని ముందు భాగం డెవలప్ అయింది. అది లాజికల్ ప్రదేశంగా భావించబడుతుంది. మంచీ, చెడూ లాంటి విచక్షణ, నిర్ణయాలు తీసుకోవడం, విలువలు పాటించడం వంటివి దీని పనులు. మనిషి రిలాక్స్ ఉన్నప్పుడు తాపీగా ఏది మంచి ఏది చెడు అన్నది అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతాడు. ఒక మనిషి ఇగోని మీరు హర్ట్ చేశారు అనుకోండి. అప్పుడు అతని మైండ్ దాన్ని ఆటవికకాలంలో జంతువులు ఎలా భౌతికంగా దాడి చేశాయో అలా స్వీకరిస్తుంది. అతను మీపై మాటలతో దాడి చెయ్యడం, అప్పటికీ అతని ఆవేశం తగ్గకపోతే చే...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...