👉 02 ఏప్రిల్ , 2020
👉 గురువారం
👉 సంవత్సరములో 93వ రోజు 14వ వారం
👉 సంవత్సరాంతమునకు ఇంకా 273 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)
🔴 ప్రత్యేక దినాలు
🚩 శ్రీరామనవమి
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
🚩 పోలీస్ పతాక దినం.
🚩 అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
[చిన్నారులూ..!
పుస్తక పఠనం... ప్రగతికి సోపానం...
చదువు వేరు.. పుస్తక పఠ నం వేరు.. చదువు పఠనా నికి సాధనం. పుస్తక పఠ నం విజ్ఞానాన్ని పెంచి, ప్రగ తికి సోపానమవుతుంది. పుస్తకాలు చదవడమనేది మంచి అలవాటు. అది చిన్నతనంలోనే అబ్బాలి. మరి 'అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం' సందర్భంగా పుస్తక పఠనం ప్రారంభించేద్దామా?!
కొన్ని అలవాట్లు చిన్నప్పుడే అలవడాలి. 'మొక్కై వంగనిది మానై వంగునా..!' అనే సామెత వినే ఉంటారు. బాల్యంలోనే పుస్తక పఠనం అలవాటైతే అది ఎప్పటికీ వాడిపోదు సరికదా! మిమ్మల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది.
పుస్తక పఠనంతో అపరిమిత విజ్ఞానం మీ సొంతమవుతుంది. కొత్త విషయాలు తెలుసు కోవాలన్న ఆసక్తి కలుగుతుంది. మీలోని ఊహాశక్తి అధికమవుతుంది.
ఇన్ని లాభాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి అంటారు పెద్దలు. ఇంత మంచి అలవాటు మీరంతా చేసుకోవాలనే ఈ రోజు (ఏప్రిల్ 2వ తేదీన) 'అంతర్జాతీయ బాలల పుస్తక మహోత్సవం' నిర్వహిస్తున్నారర్రా!
పాశ్చాత్య ప్రపంచంలో సంచలనం సృష్టించిన 19వ శతాబ్ధపు రచయిత 'హాన్స్ క్రిస్టియన్ ఏండా ర్సన్'. ఈయన బాలసాహిత్యంలో దిట్ట. హాలెండ్‌కు చెందిన ఈయన రచనలంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడేవారంట! అందుకే ఈయన రచనల్ని అన్ని భాషల్లోకి అనువదించారర్రా! మీకు ఆయన రచనలు దొరికితే తప్పక చదవండే!
ఆయన పుట్టినరోజైన 'ఏప్రిల్ 2'ను 'అంతర్జా తీయ బాలల పుస్తక దినోత్సవం'గా జరపాలని 1967లో నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని పురస్క రించుకుని మీలాంటి పిల్లల్లో సాహిత్యాభిలాష పెంచాలన్నదే ఉద్దేశం. మీరంతా మంచిపిల్లలు కదా! మరి ఎంచక్కా ఎండాకాలం సెలవుల్లో బోలెడన్ని కథల పుస్తకాలు చదవండే..!]
🚩 ప్రపంచ ఆటిజం అవగాహన డే.
[ఆటిజం, లేదా ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (ASD)అనేది ప్రజలకు కమ్యూనికేట్ చేసే విధంగా ప్రభావితం చేసే ఒక జీవితకాల నరాల మరియు అభివృద్ధి రుగ్మత, ప్రవర్తించడం లేదా ఇతరులతో పరస్పర చర్య చేయడం. PLOS మెడిసిన్ పత్రికలో ప్రచురించబడిన ఒక 2018 అధ్యయనం ప్రకారం, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఎనిమిది పిల్లలలో ఒకరు భారతదేశంలో కనీసం ఒక నరాల అభివృద్ధి రుగ్మతతో బాధపడుతున్నారు. ASD కోసం ఎటువంటి ప్రామాణిక చికిత్స లేదా నివారణ లేదు. అయితే, సరైన మద్దతు మరియు శ్రద్ధతో, ఆటిజంతో ఉన్న చాలా మంది ప్రజలు నెరవేర్చిన మరియు చురుకైన జీవితాలను గడపవచ్చు. ASD యొక్క ప్రధాన సంకేతాలను మెరుగుపరచడానికి ఏ ఔషధం లేనప్పటికీ, కొన్ని మందులు నియంత్రణ లక్షణాలకు సహాయపడతాయి.]
🏀 సంఘటనలు
✴1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణం మొదలు.
✴2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.
🌐 జననాలు
❇1725: గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (మ. 1798)
❇1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
❇1805: 19వ శతాబ్ధపు రచయిత బాలసాహిత్యంలో దిట్ట. 'హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్' జననం. ఫెయిరీ టేల్స్ (ఐరోపా జానపద కథలు) రచయితగా ప్రఖ్యాతుడయ్యాడు. (మరణం: 1875 ఆగస్టు 4 )
❇1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969)
❇1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
❇1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు
❇1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్
〰〰〰〰〰〰〰〰
⚫ మరణాలు
◾1872: సామ్యూల్ F.B.మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)
◾1933: మహారాజా రంజిత్ సింహ్‌జీ ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment