Skip to main content

చరిత్రలో ఈ రోజు, ఫూల్స్ డే యొక్క వివరణ


👉 01 ఏప్రిల్ , 2020
👉 బుధవారం
👉 సంవత్సరములో 92వ రోజు 14వ వారం
👉 సంవత్సరాంతమునకు ఇంకా 274 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)

🔴 ప్రత్యేక  దినాలు
🚩 ఒరిస్సా బ్రిటీష్ ఇండియాలో క్రొత్త ప్రావిన్సుగా అవతరించింది. (1936 )
🚩 ఏప్రిల్‌ 1ని ఏప్రిల్ ఫూల్ రోజు అంటుంటారు.
[ఇందుకు ఒక వివరణ: పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌లో కూడా సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్లు లేవు. (దండోరా వేయించి ఉంటాడు.) కాని రాజు గారి తాఖీదు అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడా పాత అలవాట్లని గభీ మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశపు మూలల్లో ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళికి ఏప్రిల్‌ ఫూల్స్‌ అనేవారు. పాత అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె బహుమానాలు ఇచ్చుకోవటం, ఎగతాళి చేసుకోవటం మిగిలేయి.]

🏀సంఘటనలు
✴1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
✴1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
✴1936: కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారత దేశంలో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
✴1957: డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి కొలమానం (యూనిట్) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.
✴1960: TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
✴1973: పులుల సంరక్షన పథకం - కోర్బెట్ట్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.
✴2001: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.

🌐జననాలు
❇1578: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (మ.1657)
❇1856: అకాసియో గాఅబ్రియెల్ వేగాస్, భారత దేశ ప్రముఖవైద్యుడు. (మ.1933)
❇1889: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940)
❇1911: ఫాజా సింగ్, భారత అథ్లెట్.
❇1911: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (మ.1949)
❇1933: భారత క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
❇1936: తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి.
❇1941: అజిత్ వాడేకర్, భారత క్రికెటర్.
❇1972: వెంకట్ గోవాడ, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత, టి.వి., చలనచిత్ర నటుడు.
❇1988: లహరి గుడివాడ, రంగస్థల నటి.

⚫మరణాలు
◾1922: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1884)
◾1999: మధురాంతకం రాజారాం, ప్రముఖ రచయిత. (జ.1930)
◾2012: ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త. (జ. 1921)
◾2018: రాజ్యం. కె, ప్రముఖ రంగస్థల నటి. (జ.1956)


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ