Skip to main content

నేటి మోటివేషన్... ఇంటి పెద్దకు ఆసరాగా టీమ్ లక్ష్య...



ఒక చిన్న సంఘటన...
జీవితాన్ని ఊహించని మలుపు ఎలా తిప్పుతుందనడానికి సజీవ సాక్ష్యం ఇది...

నెలకు 15,000 రూపాయల జీతం తో ...
ఒక కంపెనీ షో రూంలో పనిచేస్తూ...
ఇద్దరు ఆడ పిల్లలతో సహా జీవితాన్ని నెట్టుకొస్తున్న ఒక కాంట్రాక్టు ఉద్యోగి కథ ఇది...🙏🏻

షుగర్ లెవల్స్ తగ్గడంతో...
నడుస్తుండగా కుప్పకూలిపోయాడు...
దారిన పోయేవారు అయ్యో అంటూ సపర్యలు చేస్తే కోలుకున్నాడు..

ఎలాగో ఇంటికి చేరుకున్నాడు...
హమ్మయ్య ఫర్వాలేదులే అనుకున్నాడు...

కానీ కాలం అతనికొక చావు పరీక్ష పెట్టబోతుందని ఊహించలేకపోయాడు...

రోజులు గడిచే కొద్దీ...
ఫిట్స్ లా మొదలైన సమస్య...
ఆసుపత్రి దాకా తీసుకెళ్లింది...

టెస్టులు చేశాక...
మెదడు లో రక్తం గడ్డకట్టడంతో...
ఆ చిన్న సమస్యే అతన్ని ఆ సమస్య చావు అంచులుదాకా తీసుకెళ్లింది...

ఆడపిల్లల మొహాలు చూసి...
చుట్టూ ఉన్నవారు తహతుకు మించి సాయం చేశారు...

లక్షలతో కూడుకున్న వైద్యం కావడంతో....
డబ్బు చాలక మరో 5 నెలల వైద్యం అందితే...
పూర్తిగా కోలుకోవడానికి అవకాశం ఉన్నా...

డబ్బు లేక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ..
మన టీమ్ సభ్యుని ఆసరాతో సాయం కోసం మన లక్ష్య టీమ్ తలుపు తట్టడం జరిగింది...🙏🏻
సరిగ్గా నెల రోజుల క్రితం...
ఇంటి పెద్దకు ఆసరాగా మారడానికి...
ఎదిగిన ఆడ పిల్లలు రోడ్డున పడకుండా ఆపడానికి...

టీమ్ లక్ష్య ఆశని శ్వాసగా మార్చుకుని అడుగులు వేసింది...

సమస్యని మా భుజానికెత్తు కున్నాక...
మీ అడుగులు మాతో జత కలిసాక...

చినుకులా మొదలైన మా పయనానికి మీ గుండె చప్పుడు తోడవడంతో వెల్లువలా మారింది...👍

మీరు పంపిన మీ గుండె చప్పుడు...
అక్షరాలా లక్ష (1,00,000/-) రూపాయలను...
అలాగే మీరంతా కలసి అందించిన మీ వెలకట్టలేని ఆశీస్సుల్ని మూట కట్టుకుని టీమ్ లక్ష్యఆ ఇంటి తలుపు తట్టింది...

ఇప్పటికీ తడి ఆరని ఆ కనుల్లో వెలుగులు నింపింది....
ఏది ఏమైనా టీమ్ లక్ష్య వారి వెనుక నిలబడిందన్న ధీమా వారి మాటల్లో వినబడింది...

ఇది కదా...
మనకు కావల్సింది....
ఇదే కదా మనమంతా ఆశించింది...🙏


నిన్న రాజమండ్రి లో జరిగిన ఈ కార్యక్రమంలో నాతోపాటు, మన లక్ష్య టీమ్ కుటుంబ సభ్యులు శ్రీ కిషోర్ గారు పాల్గొన్నారు... విలువైన సమయాన్ని వెచ్చించిన కిషోర్ గారికి టీమ్ లక్ష్య నుండి ప్రత్యేక కృతజ్ఞతలు...🙏

మీ
టీమ్ లక్ష్య

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺