ఒక చిన్న సంఘటన... జీవితాన్ని ఊహించని మలుపు ఎలా తిప్పుతుందనడానికి సజీవ సాక్ష్యం ఇది... నెలకు 15,000 రూపాయల జీతం తో ... ఒక కంపెనీ షో రూంలో పనిచేస్తూ... ఇద్దరు ఆడ పిల్లలతో సహా జీవితాన్ని నెట్టుకొస్తున్న ఒక కాంట్రాక్టు ఉద్యోగి కథ ఇది...🙏🏻 షుగర్ లెవల్స్ తగ్గడంతో... నడుస్తుండగా కుప్పకూలిపోయాడు... దారిన పోయేవారు అయ్యో అంటూ సపర్యలు చేస్తే కోలుకున్నాడు.. ఎలాగో ఇంటికి చేరుకున్నాడు... హమ్మయ్య ఫర్వాలేదులే అనుకున్నాడు... కానీ కాలం అతనికొక చావు పరీక్ష పెట్టబోతుందని ఊహించలేకపోయాడు... రోజులు గడిచే కొద్దీ... ఫిట్స్ లా మొదలైన సమస్య... ఆసుపత్రి దాకా తీసుకెళ్లింది... టెస్టులు చేశాక... మెదడు లో రక్తం గడ్డకట్టడంతో... ఆ చిన్న సమస్యే అతన్ని ఆ సమస్య చావు అంచులుదాకా తీసుకెళ్లింది... ఆడపిల్లల మొహాలు చూసి... చుట్టూ ఉన్నవారు తహతుకు మించి సాయం చేశారు... లక్షలతో కూడుకున్న వైద్యం కావడంతో.... డబ్బు చాలక మరో 5 నెలల వైద్యం అందితే... పూర్తిగా కోలుకోవడానికి అవకాశం ఉన్నా... డబ్బు లేక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ.. మన టీమ్ సభ్యుని ఆసరాతో సాయం కోసం మన లక్ష్య టీమ్ తలుపు తట్టడం జరిగిం...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...