మీ అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న
లక్ష్య_స్వచ్చంద_సేవా_సంస్థ
ఎక్కడ ప్రాణం ఊగిసలాడి...
ఆసరా కోసం ఆగి నిలుచుందో...
అక్కడ నేనున్నానంటూ...
లక్ష్య అడుగులు వేసింది..
వేసే ప్రతీ అడుగు ఓర్పుగా....
ఒక ఉద్యమంలా ...
ఒక నిలువెత్తు నమ్మకంలా తన నడకను ప్రారంభించింది....
అక్షరానికి_దూరంగా_నిలిచి
దిక్కు తోచని స్థితిలో ఉన్నవారికి...
వేగు చుక్కలా కావలా కాసింది...
రక్తదానం చేసి ప్రాణాలను నిలిపే సంజీవినిగా మారింది...
ప్రతిభకు పట్టం కట్టే సమయంలో... చంద్రునికో నూలు పోగు ఆన్నట్లు తన వంతు సాయం అందించింది....
కాలే కడుపుల ఆకలి తీర్చడం కోసం....
#గుక్కెడు గంజినైయ్యింది... #బుక్కెడు బువ్వగా మారింది...
పచ్చని పుడమితల్లిని పర్యావరణ కాలుష్య కోరల నుండి కాపాడటానికి...
#పర్యావరణ_మిత్రుడిగా మారింది...
చివరిగా...
#లక్ష్య అంటే...
#సహాయం చేయడం కాదు...
#సహాయం చేయడాన్ని అలవాటు చేయడం...
#కొన్ని_ఆశల్ని...
#కొన్ని_లక్ష్యాల్ని...
కొన్ని బాధ్యతల్ని కలబోసి...
ముందుకు అడుగు వేసేలా ప్రోత్సహించడం....
లక్ష్య అంటే ఒంటరిగా అడుగులు వేయడం కాదు...
వందల పాదాల్ని జతచేసి ఒక్కటిగా నడిపించడం.....!
జత కలిసిన మంచి మనసులకు ప్రణమిల్లుతూ....🙏
▪️మన టీమ్ లక్ష్య యొక్క నూతన లోగో...
♦️ఈ లోగో ఇంత అద్భుతంగా రావడానికి అహర్నిశలు కృషి చేసిన మా గురువు గారు కృష్ణారెడ్డి గారికి టీమ్ లక్ష్య ఎల్లప్పుడూ రుణపడి ఉంటది...
♦️మన లక్ష్య టీమ్ కి అన్ని విషయాల్లో విలువైన సలహాలు ఇస్తూ, ముందుకు నడిపిస్తున్న మీకు నా ఆఖరి శ్వాస వరకూ రుణపడి ఉంటాను గురూజీ...
ఐదేళ్ళ కాలంలో...
టీమ్ లక్ష్య ఏం చేసిందంటే....
బలపంలా మారి...
అక్షర సేద్యం చేసింది...
ఆకలి అన్నచోట అక్షయ పాత్రగా మారి...
కష్టం అన్నఇంట పెన్నిధిగా కొలువైంది...
బరువైన ఆశయాన్ని బాధ్యతగా మోస్తూ...
మీరు పంపిన..
మీ ప్రతీ పైసాకు కావలా కాస్తూ..
మీ గుండెచప్పుడికి సాక్ష్యంగా నిలిచింది...
అదే తీరుగా...
అంతే నిబద్ధతతో...
రెట్టించిన నిజాయితీగా...
అడుగులు వేస్తుంది....
ఆకలనే కొలమానంతో...
అణుకువనే ఆభరణాన్ని ధరించి...
అవసరమైన చోట...అవసరమున్నంత మేరకు మాత్రమే...అడుగులు వేస్తుంది...
ఎన్నేన్నో రంగులు వెలసిన జీవితాల్లో రంగులు నింపుతూ...
సంతోషాన్ని పెంచుతూనవ్వులు నింపుతున్న...
మీ గొప్పతనం గురించి ఏమని చెప్పేది...?
ఏమని రాసేది...?
ఎలా ఉంటారో తెలియదు...!
ఎక్కడ ఉంటారో తెలియదు...!
అయినా కష్టం అనగానే...
కనిపించని దైవంలా అడుగులు వేస్తారు...
అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ...
నిముషంలో మీ గుండె చప్పుడు పంపుతారు...🙏🏻
ఏమి గుండెలు ఇవి...?
ఏళ్ళు గడుస్తున్నా...
అదే ఒరవడి...
అంతే ఉత్సాహం...
వారెవ్వా ఇది కదా జీవితం అంటూ అడుగులు వేస్తున్న ప్రతీ మానవ దైవానికి టీమ్ లక్ష్య శిరస్సు వంచి నమస్కరిస్తుంది...🙏🏻
మీ
టీమ్ లక్ష్య
మీరు పంపిన మీ రూపాయి..
అక్షరమై కనిపిస్తే...
ఆయువై ఊపిరి పోస్తే...
అడుగై..నడకగా మారితే...
ఎలా ఉంటుందో తెలుసా...🙂
పట్టరానంత ఆనందం..
చెప్పలేనంత సంతోషం...
సరిగ్గా ఇలా ఉంటుంది👍
సరిగ్గా రెండేన్నర సంవత్సరాల క్రితం...
వరంగల్ జిల్లా..
వర్ధన్నపేట మండలం...
దమ్మన్న పేట గ్రామంలో...
మంచానికి పరిమితం అయిన జ్యోతి జీవన గాధ ఇది....
ఇదిగో...
మీ గుండె చప్పుడు ఆసరాగా మారి అడుగులు వేస్తోంది...
త్వరలోనే జీవన పయనంలో పరుగులు తీస్తుందని మీకు తెలియజేస్తూ👍
మీ
టీమ్ లక్ష్య
ఇలా ఇప్పటి వరకూ మనం చేసిన కార్యక్రమాలు ఇవిగో...
మంచి లక్ష్యం కోసం పాటుపడుతున్న లక్ష్య టీం కు నా అభినందనలు.🙏🙏
ReplyDelete