మీ అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న లక్ష్య_స్వచ్చంద_సేవా_సంస్థ ఎక్కడ ప్రాణం ఊగిసలాడి... ఆసరా కోసం ఆగి నిలుచుందో... అక్కడ నేనున్నానంటూ... లక్ష్య అడుగులు వేసింది.. వేసే ప్రతీ అడుగు ఓర్పుగా.... ఒక ఉద్యమంలా ... ఒక నిలువెత్తు నమ్మకంలా తన నడకను ప్రారంభించింది.... అక్షరానికి_దూరంగా_నిలిచి దిక్కు తోచని స్థితిలో ఉన్నవారికి... వేగు చుక్కలా కావలా కాసింది... రక్తదానం చేసి ప్రాణాలను నిలిపే సంజీవినిగా మారింది... ప్రతిభకు పట్టం కట్టే సమయంలో... చంద్రునికో నూలు పోగు ఆన్నట్లు తన వంతు సాయం అందించింది.... కాలే కడుపుల ఆకలి తీర్చడం కోసం.... #గుక్కెడు గంజినైయ్యింది... #బుక్కెడు బువ్వగా మారింది... పచ్చని పుడమితల్లిని పర్యావరణ కాలుష్య కోరల నుండి కాపాడటానికి... #పర్యావరణ_మిత్రుడిగా మారింది... చివరిగా... #లక్ష్య అంటే... #సహాయం చేయడం కాదు... #సహాయం చేయడాన్ని అలవాటు చేయడం... #కొన్ని_ఆశల్ని... #కొన్ని_లక్ష్యాల్ని... కొన్ని బాధ్యతల్ని కలబోసి... ముందుకు అడుగు వేసేలా ప్రోత్సహించడం.... లక్ష్య అంటే ఒంటరిగా అడుగులు వేయడం కాదు... వందల పాదాల్ని జతచేసి ఒక్కటిగ
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...