పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించేవారు ఎవరికి వారే యమునాతీరేలాగా తమ చుట్టూముట్టు గిరిగీసుకుని ఇరుగు పొరుగు వారితో సంబంధం లేకుండా, ఎవరి తోనూ మాట్లాడకుండా ఉంటున్నారు. అందుకు కారణం, కుటుంబంలోని ప్రతి వారూ బిజీగా ఉండటమే, ఆలుమగలి ద్దరూ ఉద్యోగం చేయడం, పిల్లలు కూడా స్కూలు నుంచి వచ్చిప్పటినుండి హోమ్ వర్కులు, చదువుతో గడుపుతూ ఆరు బయట ఆడుకోకపోవడం, ఆ తర్వాత టి.వి.ముందు కుర్చోవడం చేస్తారు. ఆలు మగలిద్దరూ యాంత్రిక దినచర్యతో, ఉద్యోగంతో బిజీగా ఉండటంతో,చుట్టు ప్రక్కల ఎవరున్నారో, వారేంచేస్తారో, వారి పేర్లేమిటీ కూడా పట్టించుకోరు. • చుట్టు ప్రక్కలవారు స్నేహబాంధవ్యాలు పెంచు కోవడం ప్రతివారికీ అవసరం. ఏదో ఒక సమయంలో ఇరుగు పొరుగువారి అవసరం తప్పనిసరి అవుతుంది. ఏకష్టమొచ్చినా, దు:ఖంలోనూ, బాధల్లోనూ మొట్టమొదటగా ఆడుకునేవారు ఇరుగుపొరుగులే అని తెలుసుకోవాలి. • ఇతరులతో అంటీ ముట్టనట్టుగా ప్రవర్తించకూడదు. ఎవరి మటుకు వారు మౌనంగా ఉంటూ నాలుగు గోడల మధ్యనే కాలం గడుపాలను కోకూడదు. సమాజంలో తోటి మనుషుల మధ్యకలిసి బ్రతుకుతున్నప్పుడు కలిసి కట్టుగా స్నేహబంధాన్ని పెంచుకుంటూ మెలగాలి. • ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు తీరిక సమ యంలో ఇరుగుపొరు
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...