ఆంధ్రప్రదేశ్‌లో బి.ఎడ్ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం APEDCET 2026 వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలో ర్యాంకు సాధించి, సంబంధిత అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ నిధులతో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ప్రవేశాలు కల్పించనున్నారు. ముఖ్యమైన తేదీలు రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 5, 2026 రిజిస్ట్రేషన్ చివరి తేదీ: అక్టోబర్ 12, 2026 నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 1, 2026 దరఖాస్తు విధానం అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తదుపరి కౌన్సెలింగ్ షెడ్యూల్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు వివరాలను వెబ్‌సైట్‌లో పరిశీలించాలి. అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ గమనిక: అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించడమైనది. ఈ సమాచారాన్ని బి.ఎడ్ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారికి షేర్ చేయండి. Lakshya Educational Groups